మ‌ళ్లీ  ఆగిన చ‌ర్చ‌లు

Date:17/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడపటాన్ని ఎలా వాయిదా వేయాలా ఆనే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు పోటీ పడుతున్నట్లుంది. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు ఎవరు ఎన్ని నడపాలి అనే అంశంపై గత రెండు నెలలుగా సాగుతున్న చర్చలు ఇప్పుటికిప్పుడే కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. మంగళవారం జరిగిన తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే విషయమై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎటుతేల్చకుండానే ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే అంశంపై కిలోమీటర్ల ప్రాతిపదికన నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే.. అలా కాదు… రూట్ వైజ్ ప్రాతిపదికన నడపాలంటూ తెలంగాణ అధికారులు ప్రతిపాదించారు. అలాగైతే మాకు సాధ్యం కాదని ఏపీ ఆర్టీసీ ఆధికారులు ఖండించగా, ఇలాగైతే మాకు కూడా సాధ్యం కాదంటూ తెలంగాణ ఆర్టీసీ అధికారులు సమర్థించుకుని అర్థాంతరంగా చర్చలు ముగించారు. ఫలితం తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ చర్చలు మళ్లీ విఫలం అయ్యాయి. ఇప్పటికే పలుమార్లు చర్చించినా.. మరోసారి అదే సీన్ పునరావృతం కావడం విశేషం. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు మాట్లాడుతూ రూట్ వైజ్ బస్సులు నడపటం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. దేశమంతటా కిలోమీటర్ల ప్రాతిపదికన మాత్రమే అంతరాష్ట్ర సర్వీసులున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏపీ బస్సులు 71 రూట్లలో నడుస్తోంటే.

 

 

ఏపీలో తెలంగాణ బస్సులు 28 రూట్లలో మాత్రమే నడుస్తున్నాయన్నారు.  అయితే తెలంగాణ పెట్టిన రూట్ వైజ్ ప్రతిపాదనపై స్టడీ చేస్తామని వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మరోసారి ఈడీల స్థాయిలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. చర్చలు కొలిక్కి వచ్చేలోపు.. హైదరాబాద్, విజయవాడల మధ్య డిమాండ్ దృష్ట్యా చెరొక 250 బస్సులు నడుపుదామని ప్రతిపాదించామన్నారు. మా ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం చెబుమని తెలంగాణ అధికారులు చెప్పారన్నారు. అయితే ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య సయోధ్య కుదరకపోతే మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ లాభపడతాయని కృష్ణబాబు అభిప్రాయపడ్డారు.అయితే తాము మాత్రం రూట్ వైజ్ ప్రాతిపదికన మాత్రమే ఏపీకి బస్సులు నడుపుతామని టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. రూట్ వైజ్‌గా బస్సులను నడపాలని ఏపీ అధికారుల ముందు ప్రతిపాదించినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం చెబుతామన్నారు. రూట్ వైజ్ నడిపితేనే ఇరు రాష్ట్రాల ఆర్టీసీలకు లాభం చేకూరుతుందని చెప్పుకొచ్చారు.

 

తమ ప్రతిపాదనకు అంగీకరిస్తేనే ఏపీలో బస్సులను నడుపుతామని స్పష్టం చేశారు. కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు నడపటం వలన నష్టం వస్తోందని వివరించారు. తమ ప్రతిపాదనను స్టడీ చేసి మళ్ళీ చర్చలకు వస్తామన్నారన్నారు. హైదరాబాద్-విజయవాడల మధ్య చెరో 250 బస్సులను నడిపే అంశంపై ఏకాభిప్రాయం రాలేదని సునీల్ శర్మ తెలిపారు.ఆగస్టు 24న కూడా ఇదేవిషయమై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు జరిగి విఫలమవడం తెలిసిందే. తెలంగాణలో ఏపీ ఆర్టీసీ బస్సులు 1.2 లక్షల కిలోమీటర్ల దూరం నడుస్తుండగా ఏపీలో తెలంగాణ బస్సులు దాంట్లో సగం దూరం కూడా నడవకపోవడం అనేదే చర్చలకు ప్రతిష్టంభన కలిగిస్తున్నట్లు కనిపిస్తోంది.

వ్యూహ‌త్మక అడుగుల‌తో చంద్ర‌బాబు

Tags: Discussions stopped again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *