Date:04/06/2019
పుంగనూరు ముచ్చట్లు:
ప్రస్తుతం అనేక రకాల వ్యాదులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని , వాటిపై అవగాహన పెంచుకుని, నివారణ చర్యలు చేపట్టాలని చైల్డ్ఫండ్ ఇండియా ప్రతినిధి నాగరాజు తెలిపారు. మంగళవారం మండలంలోని వనమలదిన్నె గ్రామంలో ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ఫండ్ ఇండియా ప్రాంతీయ పర్యవేక్షకురాలు మంజుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిడ్స్, టివి వ్యాదుల నివారణపై చైతన్య కార్యక్రమం చేపట్టారు. కలుషిత రక్తమార్పిడి, లైంగిక సంబంధాలు, శుద్దిచేయని సిరంజీలతో అంటువ్యాదులు సంభవిస్తోందని తెలిపారు. వ్యాదిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు వ్యాదుల పట్ల అవగాహన పెంచుకుని, జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అరుణ, సీసీలు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపుతాం
Tags:Disease awareness seminar