Disease sanitation programs during summer

వేసవిలో రోగాలు ప్రభలకుండ పారిశుద్ద్య కార్యక్రమాలు

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:28/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

వేసవికాలంలో అంటురోగాలు ప్రభలకుండ మున్సిపాలిటి పరిధిలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శుక్రవారం ఆయన మున్సిపల్‌ కార్మికులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని మురుగునీటికాలువల్లో నీటి నిల్వలు లేకుండ తొలగించి, కాలువల్లో పూడికమట్టిని తొలగించే కార్యక్రమం ప్రారంభించారు. అలాగే పూడిక మట్టిని ఎప్పటికప్పుడు ట్రాక్టర్లతో తరలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ వేసవిలో దోమలు ప్రభలి అంటు రోగాలు, జ్వరాలు ప్రభలే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి, బ్లీచింగ్‌, ఫినాయిల్‌,మోలాతిన్‌ను స్ప్రే చేయిస్తామన్నారు. అలాగే ఫాగింగ్‌ చేస్తామన్నారు. పట్టణ ప్రజలు పారిశుద్ధ్య కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. రోడ్లపై చెత్తవేయడం చేయరాదన్నారు. అలాగే నీటిని కాచివడపోసి వినియోగించుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఆహార పదార్థాలను నిల్వ చేయకుండ వినియోగించుకోవాలని సూచించారు. హ్గటళ్లు, సినిమా •యెటర్లు, టీ దుకాణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. అలాగే పండ్ల వ్యాపారులు చెడిపోయిన పండ్లను విక్రయించరాదని, అలాంటి వాటిని మున్సిపల్‌ చెత్తకుండీలలో పడవేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వామ్యులై , అంటువ్యాదులు ప్రభలకుండ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాలను శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్‌ పర్యవేక్షించారు.

 పెండింగ్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం

Tags: Disease sanitation programs during summer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *