కరోనా చార్జీలపై డిస్ ప్లే

Date:13/08/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

కరోనా చికిత్సల పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.లక్షల బిల్లు వసూలు చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తు్న్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్పొరేటు ఆస్పత్రుల తీరుపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ధరలకు సంబంధించి ప్రభుత్వం మరోసారి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా మార్గదర్శకాలు విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని మరోసారి ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. కొవిడ్ చికిత్స ఫీజుల వివరాలను ఆస్పత్రిలో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని నిర్దేశించింది. పీపీఈ కిట్లు, ఖరీదైన మందుల ధరలను సైతం ఆస్పత్రిలో పేషంట్ల కుటుంబ సభ్యులకు కనిపించేలా ఉంచాలని సూచించింది.కొవిడ్‌ చికిత్సకు ఉపయోగించే మందులకు ఎంఆర్‌పీ ధరలే వసూలు చేయాలని స్పష్టంగా మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా బాధితులను డిశ్చార్జి చేసే సమయంలో కుటుంబ సభ్యులకు సమగ్ర వివరాలతో బిల్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది.

 

 ఐఐటీ, ఐఐఎంలలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్

Tags:Display on corona charges

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *