ఏపీ, తమిళనాడు మధ్య వివాదాలు

Date:04/05/2020

నెల్లూరు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌- తమిళనాడు సరిహద్దుల్లో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంతో.. నెల్లూరు జిల్లాలోని తడ మండలం బీవీ పాలెం, రామాపురం ప్రాంతాల్లోని మద్యం షాపుల వద్దకు తమిళులు భారీగా చేరకుంటున్నారు. ఒక్కసారిగా తమిళులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వైన్‌ షాపుల వద్ద తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం షాపులను మూయించి పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చారుమరోవైపు కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏపీలో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.

ఏపీలో కొత్తగా 67 కేసులు

Tags: Disputes between AP and Tamil Nadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *