చిత్తూరులో అడ్డూ, అదుపు లేకుండా నిర్మాణాలు

Disruption in Chittoor

Disruption in Chittoor

Date:15/08/2018
తిరుపతి ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అమ్మచెరువు మిట్ట వద్ద గల కోళ్ళబైలు పంచాయతీ పరిధిలో సర్వే నంబర్‌ 617/2, 617/4 లలో 529 ప్లాట్లలలో కబ్జాలు చేసి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, అక్రమ బోరు వేసుకొని నీటి వ్యాపారం సాగిస్తున్నా రెవెన్యూ అధికారు లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం గమన్హాం. కంటి ముందే కబ్జాలు చేసి లక్షల, లక్షలు సొమ్ము చేసుకుంటున్నా తమ వాటా వచ్చిందిలే అనుకుంటూ రెవెన్యూ అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పత్రికల్లో వస్తే ఏమౌతుంది, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు మీకు ఇష్టమొచ్చినట్లు చేసుకోండంటూ సదురు కబ్జా దారుడు బాధితులపై మనుషులను పెట్టించి మరి దాడులు చేయిస్తున్నాడు.
ఇందుకు ఉదాహరణ పైసర్వే నంబర్లకు సంబంధించి భూ కజ్జాలకు గురవున్న బాధితులకు బాసటగా నిలిచాడనే కోపంతో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తిపై దాడి చేసేందుకు కజ్జాదారుడుకి చెందిన వ్యక్తులు వెంబడించారు. దీన్ని గమనించిన బాధితుడు రాజ్‌కుమార్‌ 2టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా గత బుధవారం బాధితులు స్థానిక ఆర్టీఓ గణేష్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆర్డీఓ స్పంది ఆ భూమిపై కోర్టులో స్టేటస్‌కో ఆర్డర్‌ ఉండడంతో నిర్మాణాలను నిలిపి వేయాలని చెప్పామని అయినా నిర్మాణాలు చేపట్టి ఉంటే వాటిని తొలగిస్తామిని చెప్పారు.
సంబంధిత రెనెన్యూ అధికారులు అక్కడికి వెల్లకపోవడంతో సదరు వ్యక్తి, అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అక్రమంగా వేసిన బోరు నుండి యథేచ్ఛగా నీటి విక్రయాలు చేస్తున్నా పట్టించుకోక పోవడంతో తనకు ఇంక ఎవ్వరూ ఎదురు లేరని తన ఇష్టారాజ్యంగా ప్లాట్లు విక్రయించడం, అడ్డుతిరిగే వారిపై దాడులకు సైతం పూనుకుంటున్నా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమన్హాం. అంతే కాకుండా రెవెన్యూ అధికారులు సైతం పై తెలిపిన వ్యక్తికి సహకరించకుంటే ట్రాన్స్‌ఫర్‌ నజరానా కూడా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు కూడా తెలిసింది. కనీసం రెవెన్యూ సిబ్బందిపై తెలిపన సర్వేనంబర్ల స్థలాల్లోకి అడుగుపెట్టే సాహసం చేయడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధి కారులు స్పందించి సదురు కబ్జాదారు డిపై చర్యలు తీసుకో వాలని బాధితులు కోరుతున్నారు.
Tags:Disruption in Chittoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *