Disruption to communalism

మతసామరస్యానికి విఘాతం

– 15వ రోజు కొనసాగిన దీక్షలు

Date:25/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం మత సామరస్యానికి విఘాతం కలిగిస్తోందని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం 15వ రోజు రిలే దీక్షలు పట్టణంలోని బీడీకాలనీలో గల సుభాని మసీదు ముతవల్లి నూర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ప్లకార్డులలో పౌరసత్వ సవరణ చట్టం వద్దు… ఎన్‌ఆర్‌సీ, సీఐఏ, ఎన్‌ఆర్‌పీ రద్దుపరచండి….కొత్తచట్టాలను బహిష్కరిస్తాం…. రాజ్యాంగాన్నికాపాడండి…. దేశాన్నివిభజించ వద్దు అన్న నినాదాలతో కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముతవల్లి నూర్‌ మాట్లాడుతూ భారతదేశంలో మతసామరస్యం నెలకొల్పుతామని ప్రకటనలు ఇచ్చే బిజెపి నాయకులు మతాలను అణగదొక్కడం సమంజసమా అంటు ప్రశ్నించారు. రాజ్యాంగంలో మేరకు ప్రజాస్వామ్య దేశంలో ఉన్న హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చట్టాన్ని రద్దు చేయాలని , పౌరసత్వ సర్వేలు ఆపివేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ముస్లింలు అన్ని మతాలు, కులాలతో కలసి అఖిలపక్ష పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

కంటి వైద్యశిబిరానికి స్పందన

Tags: Disruption to communalism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *