కాకతీయ, ఉస్మానియా వర్శిటీలుకు దూరం

Distance from Kakatiya and Osmania universities

Distance from Kakatiya and Osmania universities

కేసీఆర్ సెంటిమెంట్
Date:10/10/2018
వరంగల్  ముచ్చట్లు:
రాజకీయ ప్రత్యర్థులపై పెద్ద నోటితో విరుచుకుపడే తెలంగాణ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ కు ప్రాధన్యం ఇస్తారని మరోసారి రుజువైందంటున్నారు ఆయన విమర్శకులు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టే ధైర్యం కేసీఆర్‌కు లేదని ఇప్పటికే చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది.. ఇప్పుడు దానికి వరంగల్ కూడా తోడైంది. ఆశీర్వాద సభల పేరిట వరుసగా మూడు రోజుల పాటు మూడు జిల్లాల్లో సభలు నిర్వహించిన కేసీఆర్ నాలుగో సభను రెండు రోజుల కిందట వరంగల్‌లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ దాన్ని చెప్పాపెట్టకుండా వాయిదా వేసుకున్నారు. కేసీఆర్‌లో భయం ఆవహించిందన్న విమర్శలు మొదలయ్యాయి.నిజానికి టీఆరెస్ పార్టీ బహిరంగ సభల్లో అత్యంత భారీ సభ ఒకప్పుడు వరంగల్‌లోనే జరిగింది. 2010 డిసెంబరు నెలలో నిర్వహించిన ఈ సభకు లక్షలాది మంది వచ్చారు.
పదుల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయిపోయింది. కానీ, ఇప్పుడు సభను చెప్పాపెట్టకుండా వాయిదా వేశారు. వరంగల్‌లో తన సభ అట్టర్ ప్లాఫ్ కావడం ఖాయమని అర్థం కావడంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.నిజానికి 2014 ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో రెండు సీట్లు తప్ప మిగతా అన్నీ టీఆరెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు కొండా సురేఖ ఫ్యామిలీ కేసీఆర్‌తో విభేదించడం… ఆ కుటుంబానికి మూడు నియోజకవర్గాల్లో గట్టి పట్టుండడంతో కేసీఆర్ సభలో వారు అల్లరి చేయడం ఖాయమని ఆయన టెన్షన్ పడ్డట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయంపై అసలే కష్టాల్లో ఉన్న సమయంలో అలాంటి చోట సభ పెట్టి అభాసుపాలైతే ఉన్న పరువు కూడా పోవడం ఖాయమన్న భయంతోనే కేసీఆర్ వరంగల్ వైపు వెళ్లలేదని టాక్.
పాత వరంగల్ జిల్లా ప్రాంతంలోని 10 నియోజకవర్గాలలో ఒక్క వరంగల్ తూర్పు తప్ప అన్ని నియోజవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే, సమస్య అక్కడే వచ్చింది. ప్రకటించిన ఆ ఒక్క నియోజకర్గం వల్లే సిటింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయింది. అభ్యర్థుల పేర్ల ను ప్రకటించిన నియోజకవర్గాలన్నింటి అసమ్మతి చెలరేగుతూ ఉంది. స్వయాన ఉపముఖ్యమంత్రి  కడియం శ్రీహరి  స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఒక రౌండ్ తన బలగాన్ని వరంగల్ కు రప్పించి ప్రదర్శన చేయించారు. వేలాది మంది ఆయన బస చేసిన గెస్ట్ హౌస్ కు వచ్చి స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేయాలని కోరారు.
వరంగల సభలో కడియం శ్రీహరికి అనుకూలంగా నినదాలు చేసే ప్రమాదం ఉండింది. ఇదే విధంగా సురేఖ మనుషుల కూడా సభలో ప్రవేశించి అలజడి సృష్టించేవారట.పాలకుర్తిలో దయాకర్ రావు పేరును ప్రకటించడానికి ఒరిజినల్ టిఆర్ ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే, దయాకర్ రావు టిడిపినుంచి ఫిరాయించి, సీటును తన్నుకుపోవడం నియోజకవర్గం టిఆర్ ఎస్ లో ఒక బలమయిన వర్గానికి ఇష్టం లేదు. ఇదే విధంగా అసెంబ్లీ  స్పీకర్ మధుసూదనాచారికి టికెట్ ఇవ్వడానికి  నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది.
జనగాం నియోజకవర్గంలో కూడా అసమ్మతి కుతకుత ఉడుకుతూ ఉంది. అక్కడ యాదగిరి రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని పార్టీ నేతలు చాలా  మంది వ్యతిరేకిస్తున్నారు.  చాలా చోట్ల అసమ్మతి వాదులు కెసియార్ స్వయంగా ప్రటించిన అభ్యర్థిని గెలిపించలేమని ప్రకటిస్తున్నారు. ఇలా ప్రతిచోట అసమ్మతి రగులుతూ ఉంది. అసమ్మతి నేతలను చల్లబర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందువల్ల వాళ్లంతా సభకు వచ్చి గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఈ జిల్లాలో నుంచి పార్టీ నేతల నుంచి నివేదికలు అందడంతో సభను వాయిదా వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
Tags:Distance from Kakatiya and Osmania universities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed