సంక్రాంతికానుకగా బట్టలు పంపిణీ

చౌడేపల్లె ముచ్చట్లు:
 
మండలంలోని చారాల ,శెట్టిపేట పంచాయతీ పరిధిలోని పంజాణివారిపల్లె, చారాల కురప్పల్లె, యర్రప్పల్లె, తదితర గ్రామాల ప్రజలకు సంక్రాంతి పండుగకు కానుకగా జెడ్పిటీసీ సభ్యుడు ఎన్‌. దామోదర రాజు ఆదివారం కొత్త బట్టలను పంపిణీ చేశారు. పంజాణివారిపల్లెలో ఆయన స్వగృహంలో సుమారు 150 మంది సమావేశమయ్యారు. తొలుత గ్రామస్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతి ఇంటిలోని భార్యభర్త లిద్దరికీ ఒకొక్కజత చొప్పున కొత్త బట్టలు అందజేయడం, సుమారు పదేళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా కొత్త బట్టలను మహిళలకు అందజేశారు. వారు మాట్లాడుతూ జెడ్పిటీసీ కుటుంభానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని , తమ గ్రామానికి ఏ కష్టవెహోచ్చినా ఆదుకొంటున్న దామోదరరాజుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రఘుస్వామి, రమణ, ప్రసాద్‌బాబు, తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Distribute clothes as wallpaper

Natyam ad