బేతేలు ఫెలోషిప్ అద్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ

Date:21/11/2020

నెల్లూరు ముచ్చట్లు:

బేతేలు ఫెలోషిప్ వ్యవస్థాపకుడు రెవరెండ్ డాక్టర్ కండే సుందరరావు 71వ జన్మదిన సంస్మరణ సందర్భంగా వెంకటాచలం లోని బేతేలు చర్చి ప్రాంగణంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సుహాసిని సుందరరావు మాట్లాడుతూ సుందరరావు పేదలకు చేసిన సేవలను కొనియాడారు.ఆయన భౌతికంగా లేకపోయినా 71 వ జన్మదినం సందర్భంగా కుమారులు విజయ్ కుమార్,వినయ్ కుమార్,కుమార్తె మేరీ ఎలిజబెత్ లు కలిసి తండ్రి జ్ఞాపకార్ధంగా తమ స్వంత నిధులతో పేదలకు బట్టలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.అనంతరం రెవ బి డేవిడ్ దయాసాగర్ మాట్లాడుతూ మనవసేవే మాధవసేవ ,నిన్నువలె నీపోరుగు వారిని ప్రేమించు అనే సిద్దాంతంలో సుందరరావు  వున్నప్పుడు ఏవైతే చేస్తున్నారో ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు పేదలకు చేస్తున్న సేవలను ప్రతిఒక్కరు అభినందిచాలని కోరుతూ ఈసందర్భంగా కుటుంబ సభ్యులను అభినందించారు.

నందింగం.. ఉండవల్లి మధ్యలో డొక్కా

Tags; Distributing blankets to the poor at the behest of Bethel Fellowship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *