విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

Distributing books to students

Distributing books to students

Date:19/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని 24వ వార్డులో గల పాఠశాలలో ఫ్రెండ్స్  మొబైల్ షాపు యజమాని అంజాద్‌బాషా ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు , పెన్నులు, ప్యాడ్స్, వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్‌ అమ్ము హాజరైయ్యారు. ఈ సందర్భంగా షాపు యజమాని జావీద్‌ మాట్లాడుతూ పాఠశాలలోని ఒకొక్క విద్యార్థికి రూ.500లు విలువ చేసే విద్యాసామాగ్రీకిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతియేటా విద్యార్థులకు తమ వంతు సహాయం అందిస్తున్నామన్నారు. ఇందులో బాగంగా ఈ సారి కూడ విద్యార్థులకు అవసరమైన విద్యాసామాగ్రీని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో భారతి, సూపర్‌ వైజర్‌ ఐయిషా, మొబైల్ షాపు యజమానులు సాధిక్‌బాషా, జబివుల్లా , సంకల్ప సోసైటి ప్రతినిధులు జానకి, రాజు, వెంకటేష్‌, బాను, సురేష్‌, పురుషోత్తం, సుజాత, గంగులాచారి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రోడ్లపై చెత్తను పడవేస్తే జరిమానాలు విధిస్తాo

Tags: Distributing books to students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *