దేశయి కృష్ణ యూత్ సభ్యులు అద్వర్యం లో ఆహార పొట్లాలు పంపిణీ

Date::03/04/2020

కౌతాళం ముచ్చట్లు:

కరోనా వైరస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ విషయంలో ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం అహర్నిశలు కష్టపడుతున్న పోలీస్ సిబ్బందికి పంచాయతీ సచివాలయం సిబ్బందికి వాలంటీర్లకు ,వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు, ఏ ఎన్ ఎమ్ లకు కౌతాళం దేశాయి కృష్ణ యూత్  కార్యకర్తలు భోజనం ఏర్పాట్లు చేయించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో ప్రజలకు, అధికారులకు, దేశాయ్ కృష్ణ యూత్ సభ్యులు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని అదేవిధంగా ప్రజలు కూడా అధికారులకు సహకరించి వారి సలహాలను పాటిస్తూ ముఖానికి మాస్కులు ధరించాలని సూచించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల నాయకులు దేశాయ్ కృష్ణ, మాజి సర్పంచ్ అవతారం , తిక్కయ్య, హుసేని, డి రామకృష్ణ , నాగరాజు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

 గ్యాస్ సిలిండర్ల నిల్వలున్నాయి

Tags:Distributing food parcels under the auspices of Desai Krishna Youth members

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *