Distributing Gifts to Trainers in Libraries

గ్రంధాలయంలో శిక్షకులకు బహుమతులు పంపిణీ

Date:05/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని గ్రంధాలయంలో 45 రోజులుగా వేసవిలో శిక్షణ పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు పోటీలు నిర్వహించి, బహుమతులు పంపిణీ చేశారు. బుధవారం గ్రంధాలయ అధికారి శోభరామన్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధులుగా న్యాయవాది ప్రకాష్‌, విశ్రాంత తెలుగు పండితులు సీతాపతిరాజు , వెంకటపతి, రామలింగప్ప, గంగులమ్మ హాజరైయ్యారు. శిక్షణలో విద్యార్థుల నైపుణ్యం పెంపొందించేందుకు వివిధ రకాల పుస్తక పఠనం నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. సీతాపతిరాజు మాట్లాడుతూ తెలుగుబాషను అన్ని ప్రాంతాలలోను అభివృద్ధి చేయాలని డిమాండు చేశారు. తెలుగుబాషకు మనుగడ లేకపోవడంతో విద్యార్థులు తెలుగులో ఫెయిల్‌ అవుతున్న దుర్ధిదినం దాపురించిందన్నారు. తెలుగుబాషాభిమానులు ఈ విషయమై పోరాటాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ డైరెక్టర్‌ దేశాది ప్రకాష్‌, తెలుగుబాషాభిమానులు ఇంతియాజ్‌, గిరి, ప్రసాద్‌, జయకుమార్‌, శ్రీనివాసులు, సతీష్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

వేసవిలో కరాటే శిక్షకులకు సర్టిఫికెట్లు

 

Tags: Distributing Gifts to Trainers in Libraries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *