Distribution of 2.80 lakh masks to the public

ప్రజలకు 2.80 లక్షల మాస్క్ లు పంపిణీ

Date:04/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని ప్రజలందరికి ఒకొక్కరికి మూడు మాస్క్ లు చొప్పున పంపిణీ చేసేందుకు 1.20 లక్షల మాస్క్ లు తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు ఏపిఎం హరికృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం మహిళా సంఘాలచే తయారు చే సిన మాస్క్ ల ను ఆయన పంపిణీ చేశారు. అలాగే మున్సిపాలిటి పరిధిలో 1.60 లక్షల మాస్క్ లు  సిద్దం చేసి, 60 వేల మాస్క్లను పంపిణీ చేసినట్లు టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ రవి తెలిపారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు మాస్క్ లు  ఎక్కువ సంఖ్యలో పుంగనూరు నియోజకవర్గానికి కేటాయించారని తెలిపారు. తయారు చేసిన మాస్క్ లను వలంటీర్లు, కార్యదర్శులు ద్వారా పంపిణీ చేపడుతున్నామన్నారు.

హార్సిలీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలు

Tags: Distribution of 2.80 lakh masks to the public

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *