అవేర్ సంస్థ ఆధ్వర్యంలో 6000 ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్ పంపిణీ..
-ముఖ్య అతిథిగా రంపచోడవరం ఐటీడీఏ పివో ప్రవీణ్ ఆదిత్య.
గోకవరం ముచ్చట్లు:
అవేర్ సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు 6000 ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది.శుక్రవారం స్థానిక ఐటిడిఎ సమావేశపు హాలులో రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించిన అంగనవాడి కేంద్రాలకు అవేర్ ఫౌండేషన్ చైర్మన్ సహకారంతో బాలబాలికలకు ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్,పంపిణీ కార్యక్రమానికి రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ, ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ తో పాటు అవేర్ పౌండేషన్ చిన్నపిల్లలకు న్యూట్రిషన్ కి సంబంధించిన పదార్థాలు ఏర్పాటు చేయాలని ఐసిడిఎస్ ద్వారా ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. అందుకు ముందుగా రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలలో బాల బాలికలకు 2000 ప్లేట్లు,2000 గ్లాసులు,2000 బౌల్స్ అవేర్ ఫౌండేషన్ చైర్మన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. ఈ ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్ తీసుకున్న ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో ప్రతిరోజు ఉపయోగించాలని అంగన్వాడి సిడిపిఓ లను, సూపర్వైజర్ లను ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు. అదేవిధంగా ఏజెన్సీలోని వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశ పెట్టాలని అందుకు ప్రతిపాదనలు సంబంధిత అధికారులు ఆవేర్ సంస్థకు పంపాలని అదేవిధంగా 5 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో 2 ప్రాజెక్టులకు ఈ ప్లేట్లు గ్లాసులు బౌల్స్ రావడం జరిగిందని తెలిపారు. మిగతా మూడు ప్రాజెక్టులకు కూడా ఈ ప్లేట్లు గ్లాసులు బౌల్స్ ఏర్పాటు చేయాలన్నారు.. అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గం లో ఈ సంస్థ ద్వారా 50 బోర్లు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషించారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుకు ఐటీడీఏ ద్వారా బోర్లు ఏర్పాటు చేయుటకు గతంలో తయారు చేసిన జాబితా సమర్పించిన యెడల పరిశీలించి బోర్డులు ఏర్పాటు చేయుటకు కృషి చేయడం జరుగుతుందని పివో తెలిపారు. కరోనా సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బెడ్ సీట్లు, శానిటేజర్లు, మాస్కులు, హేండ్ బ్లౌజులు, తదితర సామాగ్రి కష్టకాలంలో అందించినందుకు అవేర్ ఫౌండేషన్ చైర్మన్ కి ప్రాజెక్టు అధికారి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఏజెన్సీలో 10 వేల మహిళలకు శానిటరి పాడ్స్ పై అవగాహన కల్పించి ఉచితంగా అందజేయడం జరిగిందని అన్నారు..ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ నీలావేణి, అవేర్ సంస్థ మేనేజర్ ఎం. ఉదయ శ్రీనివాస్, గొర్లె భవాని శంకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
Tags:Distribution of 6000 plates, glasses and bowls under the auspices of Aware Company