రైతులకు వ్యవసాయ యంత్రములను పంపిణీ

-పాల్గొన్న మంత్రి కాకాని, జిల్లా కలెక్టర్

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లాలో “వైయస్సార్ యంత్ర సేవా” పథకం కింద 34 కోట్ల 80లక్షల రూపాయల విలువైన 223 ట్రాక్టర్లు, 33 వరికోత యంత్రాలు, 11 కోట్ల 80 లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు  కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుటకు ఇదొక నిదర్శనం అని అన్నారు. రైతే రాజు అన్న చందంగా రైతు ఆరోగ్యంగా ఆర్థికంగా ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతంలోని ప్రజలు సుఖ సంతోషాలతో సమృద్ధిగా జీవనం గడిపి అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా రైతులకు అవసరమైన ట్రాక్టర్లను వివిధ యంత్ర పరికరాలను పనిముట్లను అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంటుందన్నారు. రైతు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబుతో కలిసి యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు వరి కోత మిషన్లు కొనుగోలు చేయుటకు అవసరమైన నిధులను చెక్కు రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు , జాయింట్ కలెక్టర్ రోనంగి కూర్మానాధ్ , జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ బాబు రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రాజు,తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Distribution of agricultural machinery to farmers

Leave A Reply

Your email address will not be published.