Natyam ad

పుంగనూరులో సీఎం సహాయనిధి క్రింద రూ.3.30 లక్షల చెక్కులు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఆనారోగ్య బాధితులు వేణు, నాగసురేష్‌ లకు సీఎం సహాయనిధి క్రింద రూ.3.30 లక్షల చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ కలసి చెక్కులను బాధితులకు అందజేశారు. నాగభూషణం మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సహాయాన్ని సీఎం రిలీప్‌ ఫండ్‌ ద్వారా మంజూరు చేయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవుల అమరేంద్ర, ఇంతియాజ్‌, రాజేష్‌, సురేష్‌, తేజ, బండకుమార్‌, రమణ, హేమంత్‌ , ఖాన్‌, సురేష్‌, గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Distribution of checks of Rs.3.30 lakh under CM’s relief fund in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.