ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కుల పంపిణీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి ముచ్చట్లు :

కామారెడ్డి నియోజకవర్గంలోని 48 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 17 లక్షల 50 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 803 మందికి 4 కోట్ల 85 లక్షల 46 వేల 900 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చు అయిన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రి బిల్లులను తమ కార్యాలయానికి తీసుకువచ్చి ఇస్తే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి డబ్బులు అందే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ శేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, భిక్నూర్ ఎంపీపీ గాల్ రెడ్డి, జూకంటి మోహన్ రెడ్డి, కాసర్ల స్వామి, టీఆరెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Distribution of checks sanctioned from the Chief Minister’s Assistance Fund
Government Whip Gampa Govardhan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *