సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

నెల్లూరు  ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు నివాసంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి  మరియు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి  చేతుల మీదగా చెక్కుల పంపిణీ చేసిన గూడూరు శాసన సభ్యులు డాక్టర్  వెలగపల్లి వరప్రసాద్ రావు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో గూడూరు నియోజకవర్గ  పేద ప్రజలకు అండగా, రాష్ట్ర ప్రభుత్వం వారు సీఎం సహాయనిధి కింద 4230000/- రూపాయలు , 10,62,000/- రూపాయలు ఎంపీ,  ఎమ్మెల్సీ ల చేతుల మీదగా నియోజకవర్గ ప్రజలకు చెక్కుల పంపిణీ సేడం సంతోషకర విషయమని ఎమ్మెల్యే వరప్రసాద రావు పేర్కొన్నారు.  ప్రభుత్వం వచ్చిన అప్పటి నుంచి నేటికి గూడూరు నియోజకవర్గ ప్రజలకు కోటి రూపాయల పై చిలుకు సహాయ నిధి  చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే  సమక్షంలో జన్మదిన వేడుకలను  ఆంద్రప్రదేశ్ డిజిటల్ వైస్ ఛైర్మన్ చిన్న వాసుదేవా రెడ్డి ఘనంగా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు, పట్టణ అధ్యక్షులు బొమిడి శ్రీనివాసులు, ముస్లిం మైనారిటీ నాయకులు మగ్ధుమ్ బాయ్, అన్నం మురళి గౌడ్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Distribution of CM Assistance Checks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *