Natyam ad

పుంగనూరులో రైతులకు డ్రిప్‌ పరికరాలు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని మాగాండ్లపల్లె, భీమగానిపల్లె పంచాయతీలోని రైతులకు డ్రిప్‌ పరికరాలను శుక్రవారం మాగాండ్లపల్లె ఆర్‌బికె వద్ద పంపిణీ చేశారు. సర్పంచ్‌ గంగాధర్‌, ఎంపీటీసీ నాగభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో పరికరాలను రైతులకు అందజేశారు. ఎంపీటీసీ మాట్లాడుతూ రైతులకు 5 ఎకరాలలోపు భూమి కలిగి ఉంటే 90 శాతం సబ్సిడి, దానికన్నా ఎక్కువ కలిగిన వారికి 70 శాతం సబ్సిడితో పరికరాలు అందజేస్తామన్నారు. ఆసక్తి కలిగిన రైతులు ఆర్‌బికెలలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములురెడ్డి, ప్రకాష్‌రెడ్డి, సురేష్‌రెడ్డి,పంచాయతీ కార్యదర్శి పద్మనాభరెడ్డి, సచివాలయ ఉద్యోగులు హేమాద్రి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Distribution of drip equipment to farmers in Punganur

Post Midle