కరోనా పేషంట్ కు డ్రై ఫ్రూట్స్, పండ్లు పంపిణీ

Date:19/09/2020

జగిత్యాల  ముచ్చట్లు:

జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ఒక కరోనా పేషెంట్ కు రవీంద్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేషెంట్ కు మనోధైర్యం కలిగిస్తూ డ్రై ఫ్రూట్స్, పండ్లు అందజేశారు. సంస్థ అధ్యక్షులు నర్సాపురం రవీందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సేవా హృదయం కలిగిన గొల్లపల్లి గ్రామానికి చెందిన కచ్చు కొమురయ్య, ఎల్ఐసి ఏజెంట్ చౌటపల్లి తిరుపతి, అక్షరం రిపోర్టర్ అంకం భూమయ్య, హీరో షోరూం కనుకుట్ల మహిపాల్ రెడ్డి, ఎదులాపురం భాస్కరాచారి, పోల్కల రాజ గణేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సాపురం రవీందర్ మాట్లాడుతూ  కరోనా వైరస్ బలహీన పడిందని దీనికి భయపడవలసిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాధి నిర్మూలనకు ప్రధానంగా ధైర్యం చాలా అవసరమని ఎట్టి పరిస్థితిలో భయపడ కూడదన్నారు.

“గూడు” పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వాలి

Tags: Distribution of Dry Fruits and Fruits to Corona Patient

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *