రామాపురం ఎస్టీ కాలనీ లో ఉన్న పిల్లలకు విద్యా సామాగ్రి పంపిణీ: అధ్యక్షులు మునిశేఖర్.
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయంత్రం పూట బడులలో చదువుతున్న శ్రీకాళహస్తి మండలం రామాపురం కాలనీ పిల్లలకు బుక్కులు, పలక, బలపం పాకెట్, పెన్ను, పెన్సిల్, మెండేర్, రబ్బరు, జడ రిబ్బన్, పౌడర్ మరియు దువ్వెన పంపిణీ చేయడం జరిగిందని యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మునిశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ మాట్లాడుతూ ఎస్టీ కాలనీలో ఉన్న పిల్లలందురు బాగా చదువుకొని అన్నీ రంగాలలో ముందుండాలనేదే యువనేస్తం అసోసియేషన్ లక్ష్యం అని తెలిపారు. గిరిజన పిల్లలకు సహాయం చేయడానికి ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని కోరారు.గిరిజన పిల్లలకు యువనేస్తం అసోసియేషన్ ద్వారాఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ 8466060513 కి పోన్ చేయాల్చిందిగా కోరుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యువనేస్తం కార్యదర్శి జస్వంత్, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వినోద్, యువనేస్తం సభ్యులు నాగమణి,వెంకటేష్,ట్యూషన్ టీచర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Tags:Distribution of educational materials to children in Ramapuram ST Colony: President Munishekhar.
