Date:05/05/2020
చౌడేపల్లి ముచ్చట్లు,:
మండలంలోని నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను మంగళవారం వైఎస్సార్ సీపీ నేతలు పంపిణీ చేశారు.మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్ది రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి లా సూచనల మేరకు జడ్పిటిసి దామోదర్ రాజు ఎంపిటిసి అభ్యర్థి రామమూర్తి లతోపాటు ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు వారి నిధులతో సుమారు 40 టన్నుల సరుకులను 12 వేల కుటుంబాలకు గత మూడు రోజులుగా మంగళవారం, పందిళ్లపల్లె, దిగువపల్లె పంచాయతీలలో పంపిణీ చేశారు. కరోనా విపత్కర మైన పరిస్థితులలో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ స్వీయ నియంత్రణ లో ఉండడంతో కూలీలు అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే.ఈ విషయాన్ని గమనించిన వైఎస్సార్సీపీ నేతలు ప్రతి ఇంటికి సరుకులను అందజేసి మానవత్వం చాటుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ పి పి నెంబర్అంజిబాబు, జడ్పిటిసి సభ్యుడు దామోదర్ రాజు, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి, ఎంపీటీసీలు సుధాకర్ రెడ్డి, నరసింహులు యాదవ్, నేతలు లడ్డు రమణ, ప్రభాకర్, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Distribution of essential commodities to the poor