వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

శ్రీకారం చుట్టిన చిన జీయర్ స్వామిజీ

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామి   ట్రస్టు తనవంతు కృషి చేస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలతో ప్రజల  ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్  స్వామి ట్రస్టు తరపున వికాస తరంగిణి సంస్థ నిత్యావసర వస్తువుల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టింది. బియ్యం, పప్పులు, వంటనూనె మరికొన్ని నిత్యావసర వస్తువుల ప్యాకేజీ రూపంలో అందించేందుకు పూనుకుంది. ఈ రోజు ముచ్చింతల్  శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామి   ట్రస్టు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు నిత్యావసర వస్తువులను పంపిణి చేసే వాహనానికి  శ్రీ శ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆకలితో అలమటిస్తున్న పేదలను  ఆదుకునేందుకు వికాస తరంగిణి సంస్థ తరుపున నిత్యావసర వస్తువులను పంపిణి చేస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణి కార్యక్రమం నిర్వహిస్తామని అందరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేసారు.

 

Tags: Distribution of essential items to flood victims

Leave A Reply

Your email address will not be published.