Distribution of essentials to 150 families

150 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

Date:07/05/2020

రామసముద్రం ముచ్చట్లు:

మదనపల్లి సి ఎల్ సి ట్రస్ట్ మండలంలోని 150 పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపిణీ ట్రస్టు నిర్వాహకులు కరుణాకర్ తెలిపారు. గురువారం మండలంలోని రామసముద్రం దళితవాడ , మినికి ,పెద్ద కుర్ర పల్లె, తిరుమల్ రెడ్డి, పల్లి యానాది కాలనీ ,చెంబకుర్ హరిజనవాడ ప్రాంతాల్లో పేద ప్రజలకు వీటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కరుణాకర్ మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో తమ ట్రస్టు తరఫున ఇలాంటి కార్యక్రమాలు మదనపల్లి డివిజన్ లో చేపడుతున్నట్లు తెలిపారు .పేద ప్రజలను ఆదుకోవడానికి తమవంతు సహాయం చేస్తామని పేర్కొన్నారు .మండల ఎస్ టి యు అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు అయూబ్ ఖాన్, రమాదేవి మాట్లాడుతూ ఆర్ నడింపల్లి పాఠశాలలో ఎనిమిదేళ్లపాటు ఉపాధ్యాయుడు గా పనిచేసిన కరుణాకర్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మండల శాఖ తరఫున అతనికి కృతజ్ఞతలు తెలిపారు .పేద ప్రజలను ఆదుకోవడానికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్ నరసింహులు, నాయకులు మల్లికార్జున ,సత్యబాబు ,నరసింహులు ,హరి పాల్గొన్నారు.

నెలాఖరులో వేరుశనగ విత్తనాల పంపిణీ

 

Tags: Distribution of essentials to 150 families

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *