Natyam ad

మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పంపిణీ

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన బసవయ్య కుటుంబానికి 5 లక్షల రూపాయలు అనారోగ్యంతో చనిపోయిన తులసిరాం కుటుంబానికి రెండు లక్షల రూపాయలు పంపిణీ చేసినట్లు సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కే మహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షుల తోట మద్దులు,జిల్లా కార్యదర్శి పి వెంకట లింగం, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య, భాస్కరాచారి, నాయకులు రామకృష్ణ,, నాగేశ్వరరావు, తెలిపారు. ముందుగా చనిపోయిన కుటుంబాలకు మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, కమిషనర్  రవిచంద్ర రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, వైస్ చైర్మన్ ల చేతుల మీదుగా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు చెక్కును పంపిణీ చేయడం జరిగింది.

 

 

అనంతరం వారు మాట్లాడుతూ, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి మరణించిన కుటుంబానికి ఎక్స్గ్రేషియాను ప్రకటించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నీ సిఐటియు బృందం తో కలిసి యూనియన్ నాయకులు కోరగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కౌన్సిల్లో ఆమోదం పొంది కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియాను చెక్ రూపంలో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కుటుంబానికి అన్ని విధాలుగా వర్తించే బెనిఫిట్స్ సౌకర్యాలను ఇస్తామని ఆ కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు వైసిపి ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని అన్నారు.

 

Post Midle

Tags: Distribution of exgratia to the families of workers who died while working in the municipality

Post Midle