Natyam ad

చౌడేపల్లి లో 57 మందికి అనుభవ ధృవ పత్రాలను పంపిణీ -మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

– షికారి పాలెం కు చెందిన 57 మందికి అనుభవ ధృవ పత్రాలను పంపిణీ చేసిన  రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యా వరణ, శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి

– గడ్డం వారి పల్లి, పరికిదోనలో సచివాలయాలు, ఆర్ బి కే, అంగ న్వాడి కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

 

చౌడేపల్లి  ముచ్చట్లు:

ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని  రాష్ట్ర అటవీ, విద్యు త్, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు.శనివారం మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా చౌడేపల్లి మండలం లో విస్తృ తం గా పర్యటన చేసి పలు ప్రారంభో త్సవాలు చేశారు.శనివారం మంత్రి పర్యటనలో భాగంగా చౌడేపల్లి మండల పరిపాలన సచివా లయ సమావేశపు మందిరంలో ఈ మండల పరిధిలోని షికారి పాలెం నకు చెందిన 57 మంది కి అను భవ ధృవ పత్రాలను మరియు చౌడేపల్లి పంచాయ తీ పరిధి లో దేవస్థా నం భూములలో ఇండ్లు నిర్మించుకున్న 35 మంది కి పోష షన్ సర్టిఫికెట్లను మంత్రి చేతుల మీదు గా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధి దారులదేశించి మం త్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షే మానికి సంక్షేమ అభి వృద్ధి పథకాలను అ మలు చేయడం జరు గుతున్నదని పథకా లను పూర్తి పారద ర్శకత తో అర్హులంద రికీ చేరవేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.షికారు పాలెం నకు సంబం ధించి దాదాపు 100 ఎకరాలకు పట్టాలు ఇవ్వడం జరుగు తు న్నదని, ఇంకా 150 ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉన్నదని ఈ ప్రక్రియను త్వర గా పూర్తి చేయాలని తహశీల్దార్ ను మం త్రి ఆదేశించారు. షికారులు వారికి మంజూరు చేసిన భూముల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పథకం ద్వారా ఆ భూములను అభి వృద్ధి చేసుకునేందు కు పూర్తి సహాయ సహకారాలు అంది స్తామన్నారు.. చౌడే పల్లి పంచాయితీ పరిధిలో దేవస్థానం భూముల్లో ఇండ్ల నిర్మించుకొని ఉన్న వారికి పోషషన్ సర్టి ఫికెట్లు కూడా అంది వ్వడం జరుగుతున్న దనన్నారు.

 

 

✳️అనంతరం గడ్డం వారి పల్లెలో రూ. 8.50 లక్షలతో నిర్మించిన వై ఎస్ ఆర్ అంగన్వాడి భవనం, రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం ను, రూ.21.8 లక్ష లతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం మరి యు పరికిదోన, చిన్న కంపల్లి లోరూ. 8.50 లక్షలతో నిర్మించిన వై ఎస్ ఆర్ అంగ న్వాడి భవనము లకు మంత్రి చేతుల మీదు గా ప్రారంభిం చారు.మంత్రి పర్యటనలో టిటిడి పాలక మం డలి సభ్యులు పోకల అశోక్ కుమార్, రాష్ట్ర పాల ఏకిర కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్, బోయ కొండ గంగమ్మ పాల కమండలి చైర్మ న్ మిద్దిoటి శంకర్ నారాయణ, చౌడే పల్లి తహసిల్దారు మాధవ రాజు, ఎంపీపీ రామ్మూర్తి, జడ్పిటిసి దామోదర్ రాజు, నాయకులు పెద్దిరెడ్డి, సహదేవ రెడ్డి, తదితరులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికా రులు పాల్గొన్నారు.

Tags:  Distribution of experience certificates to 57 people in Chaudepally – Minister Dr. Peddireddy Ramachandra Reddy