కరోనా బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ

జగిత్యాల ముచ్చట్లు :

 

శ్రీ విశ్వ గాయత్రి పరివార్ జగిత్యాల శాఖ వారి ఆధ్వర్యంలో గత 15 రోజులనుండి కరోనా వచ్చి
ఆసుపత్రిలలో మరియు ఇండ్లల్లో ఉన్న బాధితులకు పరివార్ ప్రతినిధులు కొమురవెళ్లి లక్ష్మీనారాయణ, లక్ష్మీ దంపతులు వారి గృహాంలో స్వయంగా తయారు చేసిన శుచి శుభ్రత గల ఆహార పొట్లాలను చేసి ప్రతిరోజు కరోనా బాధితులకు వారి గృహాలకు, ఆసుపత్రికి వెళ్లి అందించడం పట్ల పట్టణంలో పలువురు అభినందిస్తున్నారు.వీరి ఉదారతుకు స్పందించి ప్రముఖ వ్యాపారవేత్త ఎర్రవెల్లి సురేష్ 10 వేల రూపాయలు, సామాజిక సేవకులు రాజేశుని శ్రీనివాసు కొంత ఆర్థిక సహాయం చేసి వీరిని ప్రోత్సాహించ్చారు. మరియు ప్రతి రోజు కరోనా నివారణార్థం గాయత్రి మహా మృత్యుంజేయ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనారాయణ దంపతులు తెలిపారు.ఈ సందర్భంగా వీరిని కళాశ్రీ అధినేత గుండేటి రాజు, ప్రముఖ వ్యాపారవేత్త ఎర్రవెల్లి సురేష్, రాజేశుని శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Distribution of food parcels to corona victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *