హటకేశ్వరంలో భక్తులకు అన్నప్రసాదం వితరణ

శ్రీశైలం ముచ్చట్లు:

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం గురువు అయిన బ్రహ్మశ్రీ నవీన్ శర్మ పర్యవేక్షణలో వారి శిష్యబృందం శ్రీశైలం జ్యోతిర్లింగక్షేత్రం లోని హటకేశ్వరంలో భక్తులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి సాధువులు,భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరించారు.ఈ సందర్భంగా శిష్యబృందం మాట్లాడుతూ తాము చేపట్టిన అన్నప్రసాద కార్యక్రమం  భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి,గురువు అనుగ్రహంతో అశేష ఆదరణ లభించడం చాలా ఆనందదాయకం గా ఉందన్నారు మరియు శ్రీ లలిత పీఠం వారి సహకారంతో  ఈ కార్యక్రమం విజయవతంగా పూర్తి చేయగలిగాము అని శిష్యబృందం సభ్యులు తెలియజేశారు.

 

Tags: Distribution of food to devotees at Hatakeswaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *