గర్భవతులకు,బాలింతలకు ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ

చౌడేపల్లె ముచ్చట్లు:

 

గర్భవతులు, బాలింతలకు ఈనెల నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యంను పంపిణీ చేస్తున్నట్లు ఐసీడిఎస్‌ సిడిపిఓ నాగశైలజ తెలిపారు. గురువారం ఆమె స్థానిక ఐసీడిఎస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి,మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మండలంలోని 66 అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యంను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ బియ్యం తినడం వలన బిడ్డ పుట్టుకతో ఆరోగ్యవంతంగా , బలవర్థకంగా ఉండడంతో పాటు పోషకాహార లోపం లేకుండా ఎదుగుదల సాధ్యమౌతుందని చెప్పారు.ఈ బియ్యంలో ఐరన్‌,విటమిన్‌బి12,ఫోలిక్‌ ఆమ్లం లాంటి సూక్షపోషకాలు కల్గి ఉంటుందన్నారు. తల్లి గర్భం నుంచే పుట్టబోయే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దిశగా ప్రభుత్వం పునాధులు వేసిందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట సూపర్‌ వైజర్‌ మాధవీలత ఉన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Distribution of fortified rice to pregnant and lactating women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *