Natyam ad

మదనపల్లె దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలం, కోళ్ళ బైలు పంచాయతీ, అమ్మచెరువు మిట్ట నందు గల వెలుగు ప్రత్యేక పాఠశాల నందు అజాదికా అమృత్ మహోత్సవ్ భాగంగా భారత ప్రభుత్వం ఆడిప్ స్కీం వారి ఆధ్వర్యంలో అలింకో వారి సహకారంతో దివ్యాంగులకు నేడు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.అజాదికా అమృత్ మహోత్సవ్ భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ వారు భారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆడిప్ స్కీం వారి ద్వారా అలింకో వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి   కృష్ణకిషోర్   వెలుగు నందు నిర్వహించిన కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా మదనపల్లె శాసన సభ సభ్యులు  నవాజ్ భాషా  , డిఎస్పీ   కేశప్ప  , అలింకో మేనేజింగ్ డైరెక్టర్   కె.వి రాజేష్  , మొదట ముఖ్య అతిధులుగా విచ్చేయగా వెలుగు సెక్రటరీ   పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.ఎమ్యెల్యే   నవాజ్ భాషా  మాట్లాడుతూ దివ్యాంగులకు వెలుగు మోహన్ రెడ్డి , భాగ్యలక్ష్మి  చేస్తున్న సేవ లు ఎనలేనివని తెల్పారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలని తెల్పారు.

 

 

 

Post Midle

మదనపల్లె డిఎస్పీ   కేశప్ప   మాట్లాడుతూ ఈ పండుగ రోజు ఇక్కడ కు రావడం ఎంతో సంతోషంగా ఉందని దివ్యాంగులకు ఇటువంటి ఉపకరణాలను పంపిణీ భారత దేశం మొతం జరుగుతున్నదనీ తెలిసిందనీ దానిలో భాగంగా ఈ రోజు మీకు మదనపల్లెలో ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందనీ తెల్పారు.అలింకో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె.వి రాజేష్ గారు మాట్లాడుతూ 75 స్వాతంత్ర్య దినోత్సవాలను పూర్తి చేసుకున్న సందర్బంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ వారు భారత దేశం మొత్తం ఈ ఉచిత ఉపకరణాల మెగా పంపిణీ కార్యక్రమం చేపట్టిందని దానిలో భాగంగా ఈ రోజు వెలుగులో నిర్వహిస్తున్నామనీ తెల్పారు.అంధులకు స్మార్టకేన్స్, బధిరులకు శ్రవణ యంత్రాలను, విభిన్న ప్రతిభావంతులకు యంఎస్కిట్స్, శారీరక వికలత్వవారికి చంక కర్రలు, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్ మరియు వృద్దులకు చేతికర్రలు మొత్తం 70 మందికి ఈ ఉపకరణాలను ఎమ్యెల్యే శ్రీ నవాజ్ భాషా గారి , డిఎస్పీ   కేశప్ప  , అలింకో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె.వి రాజేష్ గారి చేతులమీదుగా ఇవ్వడం జరిగింది.

 

 

ఈ కార్యక్రమాన్ని షణ్ముఖ ఆర్కెస్ట్రా యాంకర్   కరుణాకర్  వ్యాఖ్యాతగా నిర్వహించారు.
తరువాత ముఖ్య అతిధి గా విచ్చేసినటువంటి మదనపల్లె శాసన సభ సభ్యులు  నవాజ్ భాషా కి , డిఎస్పీ  కేశప్ప కి, అలింకో మేనేజింగ్ డైరెక్టర్  కె.వి రాజేష్  మరియు అలింకో బృందం వారికి వెలుగు సెక్రటరీ యం. ఉదయ్ మోహన్ రెడ్డి  మొమెంటో లను అందజేసి శాలువాతో సత్కరించారు.అన్నమయ్య జిల్లా వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి శ్రీ కృష్ణకిషోర్  మాట్లాడుతూ ఈ నెల లేదా ఫిబ్రవరి ఆఖరిలో ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఉంటుందనీ డిఎస్పీ  మరియు ఎమ్యెల్యే  సహాకారాలు అందించాలనీ తెల్పారు .
ఈ కార్యమానికి విచ్చేసినటువంటి 70 మంది దివ్యాంగులు వారి సహాయకులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మదనపల్లె శాసన సభ సభ్యులు   నవాజ్ భాషా , డిఎస్పీ శ్రీ కేశప్ప , అలింకో మేనేజింగ్ డైరెక్టర్  కె.వి రాజేష్ , అలింకో బృందం, అన్నమయ్య జిల్లా వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి  కృష్ణకిషోర్ , షణ్ముఖ ఆర్కెస్ట్రా యాంకర్  కరుణాకర్ , వెలుగు సెక్రటరీ యం. ఉదయ్ మోహన్ రెడ్డి , వెలుగు కన్వీనర్ ఆర్. భాగ్యలక్ష్మి , ప్రిన్సిపాల్ పి. లీనాకుమారి , వెలుగు సిబ్బంది, 70 మంది దివ్యాంగులు పాల్గొన్నారు.

 

Tags: Distribution of free tools to disabled people in Madanapalle

Post Midle