Natyam ad

పుంగనూరులో బాలికల హాస్టల్‌కు గీజర్‌, పుస్తకాలు వితరణ

పుంగనూరు ముచ్చట్లు:

హాస్టల్‌ విద్యార్థులకు గీజర్‌, పెద్దబాలశిక్ష పుస్తకాలను న్యాయమూర్తులు వాసుదేవరావు, కార్తీక్‌ పంపిణీ చేశారు. ఆదివారం పట్టణంలోని బాలికల హాస్టల్‌లో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన వ్యాపారులు రవికిషోర్‌ విరాళంగా ఇచ్చిన పుస్తకాలను న్యాయమూర్తులు పంపిణీ చేసి, హాస్టల్‌లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ముందుకురావాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Distribution of geyser and books to girls hostel at Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.