పుంగనూరులో ప్రయాణికులకు బహుమతులు పంపిణీ

పుంగనూరుముచ్చట్లు:

స్థానిక ఆర్టీసి బస్సులో ప్రయాణించే వారికి బహుమతులు పంపణీ చేస్తున్నట్లు డిఎం సుధాకరయ్య తెలిపారు. సోమవారం ప్రయాణికులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపో బస్సుల్లో రాయచోటి, ముళబాగిల్‌, మేటిమంద, కలికిరి, తిరుపతి రూట్లలో ప్రయాణించిన వారిలో లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తున్నామన్నారు. ఈనెలలో ప్రయాణించిన అహమ్మద్‌బాషా, బాషా, ఎస్‌.వెంకట్రమణ, అలివేలమ్మ,పాల్‌బాషా, ఆర్‌వి.రె డ్డి, శిల్ప, సంతోష్‌ లకు బహుమతులు పంపిణీ చేసి, వారిని అభినందించి , సురక్షిత ప్రయాణాలకు ఆర్టీసిలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ సంధ్య, మెకానిక్‌ సూపరింటెండెంట్‌ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags:Distribution of gifts to travelers at Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *