Distribution of goods by Awake Charitable Trust

అవేక్‌ చారిటబుల్‌ ట్రస్ట్చే సరుకులు పంపిణీ

Date:23/05/2020

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పట్టణంలోని అవేక్‌ చారిటబుల్‌ ట్రస్ట్ అధినేత మబ్బు మురళిమోహన్‌ ఆధ్వర్యంలో స్థానిక డ్రైవర్స్ కాలనీలో ఉన్న హిజ్రాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాస్క్ లు, శానిటైజర్లు కూడ పంపిణీ చేసి, మురళిమోహన్‌ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో పేదలు చాలా అవస్థలు పడుతున్నారని, ముఖ్యంగా 18 కుటుంబాలలోని 45 మంది హిజ్రాలకు సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తమ ట్రస్ట్ ద్వారా పేదలకు తగిన సహాయం అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసెన్న, మునెప్ప తదితరులు పాల్గొన్నారు.

పీలేరులో తొలి కరోనా కేసు నమోదు

Tags: Distribution of goods by Awake Charitable Trust

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *