Natyam ad

బాలల ఆశ్రమానికి సరుకుల వితరణ

కడప ముచ్చట్లు:

స్థానిక ప్రకాశ్‌ నగర్‌ అర్బన్‌ బాయిస్‌ హాస్టల్లో శుక్రవారం మోరంరెడ్డి బుచ్చిరామి రెడ్డి ఎడుకేషన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు సరిపడ నిత్యావసర సరుకులను అందజేశారు.  ప్రొద్దుటూరు-1 సర్కిల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మోరంరెడ్డి వేణుగోపాల రెడ్డి కుమారుడు వెంకట సాయి తన్విత్‌ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ట్రస్టు సభ్యులు లయన్‌ కొండూరు జనార్దన రాజు మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.  బాసట బాలాజి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ అలవరుచుకొని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని బాలలు తన్విత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.  కార్యక్రమంలో సుబ్బారెడ్డి, డేవిడ్‌, గొబ్బూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Distribution of goods to the Children’s Ashram

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.