పచ్చి రొట్ట విత్తనాలు పంపిణి

దర్శి ముచ్చట్లు:

 

ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామం లో శుక్రవారం  దర్శి మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ ఆధ్వర్యంలో   రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ కార్యక్రమం   నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ రైతులు వరి సాగు చేసే ముందు భూసారాన్ని పెంపొందించడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడుకోవాలని రైతులకు సూచనలు ఇచ్చారు పచ్చిరొట్ట విత్తనములను మనము పొలంలో సాగు చేసుకుని అవి పూత దశలో వచ్చిన అప్పుడు భూమిలో కలియదున్నాలి ఆ విధంగా చేసినట్లయితే భూమికి మనము అదనపు నత్రజని అందించి నట్లు అవుతుంది దానివల్ల పంట దిగుబడి బాగా వస్తుందని తెలియజేశారు. రైతులు ముందు ముందు రోజుల్లో పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని  మెరుగుపరచు కోవాలని సూచించారు ఈ కార్యక్రమం లో ఏ.ఈ.ఓ లు ఎస్ వెంకట్రావు, జి కోటేశ్వరావు,  గ్రామ వ్యవసాయ సహాయకులు షేక్ అబ్దుల్ సత్తార్, సిహెచ్ చిరంజీవి,  పంచాయతీ కార్యదర్శి ఎన్ దేవదానం,  గ్రామ సర్పంచి వనం అన్నపూర్ణమ్మ, వైస్ సర్పంచ్  వజ్జ నాగమణి,  గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Distribution of green bread seeds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *