పుంగనూరులో 21న మంత్రి పెద్దిరెడ్డిచే చేయూత పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిచే శుక్రవారం ఉదయం 9 గంటలకు పుంగనూరులో పర్యటించనున్నారు. గురువారం చైర్మన్ అలీమ్‌బాషా మాట్లాడుతూ వైఎస్సార్ చేయూత నగదు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. పట్టణంలోని 2,396 మంది లబ్ధిదారులకు రూ.4.49 కోట్ల నగదును పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డితో పాటు పట్టణ ప్రముఖులు హాజరౌతారని తెలిపారు. మంత్రి పర్యటనలో అందరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Tags: Distribution of Handicraft by Minister Peddireddy on 21st in Punganur
