ఖని కోర్టులో న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణి

పెద్దపల్లి ముచ్చట్లు :

జీవితం ఎంతో విలువైందని కరోన విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి జీ వీ ఎన్ భరతలక్ష్మి అన్నారు. ఈ మేరకు సోమవారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన న్యాయవాదుల హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీమా అనేది ఆకాలంలో ఎంతో అవసరమని ఆ దిశగా ప్రతి ఒక్కరూ జీవిత బీమా చేసుకోవాలన్నారు. అనంతరం న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ గోదావరిఖని మున్సిప్ కోర్టు న్యాయమూర్తులు పర్వతపు రవి, టీ ఎస్ పీ భార్గవి, జీ ఎస్ ఎల్ ప్రియాంక,బార్ అసోసియేషన్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు కొత్త కాపు సుధాకర్ రెడ్డి, పాత అశోక్, మహేశ్వరం నూతి సురేష్ ,పద్మజ, రవికుమార్, గణపతి, సీనియర్ జూనియర్ న్యాయవాదులు డి గోపాల్ రెడ్డి, కిషన్ రావు, సంజయ్ కుమార్, శ్రీనివాస్, నూనె సత్యనారాయణ, దుండే మల్లేష్ రాజుకుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Distribution of health cards to lawyers in the mining court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *