పుంగనూరులో అర్హులందరికి ఇండ్ల పట్టాలు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని 3వ సచివాలయ పరిధిలోని 11 మంది పేద లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. బుధవారం కౌన్సిలర్లు పూలత్యాగరాజు, కొండవీటి గంగులమ్మ కలసి పట్టాలు పంపిణీ చేశారు. త్యాగరాజు మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు పర్యటనలో వచ్చిన అర్హులను గుర్తించి ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే నూతన పెన్షన్లు కూడ పంపిణీ చేస్తామన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గంగాధర్‌ , సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

 

Tags: Distribution of house rails to all the eligible persons in Punganur

Leave A Reply

Your email address will not be published.