పుంగనూరులో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
పేద విద్యార్థులు చదువుకు ఆటంకం కలగకుండ కొనసాగేందుకు జగనన్న విద్యాకానుక కిట్లును పంపిణీ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్షరీఫ్ తెలిపారు. సోమవారం సాయంత్రం రహమత్నగర్లోని పాఠశాలలో కౌన్సిలర్ సాజిదాబేగంతో కలసి జగనన్నవిద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం లభిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మహబూబ్బాషా, అఫ్సర్, జావీద్, జవహార్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Distribution of Jagananna Education Kits in Punganur