మంత్రాలయం జడ్పీ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ

మంత్రాలయం ముచ్చట్లు:

నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను ప్రధానోపాధ్యాయులు అంపయ్య మంగళవారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అంపయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేసిందని పాఠశాల పునః ప్రారంభం రోజున విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు అందరికీ జగనన్న విద్యా కానుక పథకం కింద యూనిఫాము, స్కూల్ బ్యాగు ,బూట్లు ,టెక్స్ట్ పుస్తకాలు, నోటుబుక్కులను ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు  అందజేశారు. ప్రధానోపాధ్యాయులు అంపయ్య మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల చదువుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించిందని అమ్మ ఒడి విద్యా కానుక లాంటి పథకాలు గొప్ప పథకాలని అన్నారు.విద్యార్థులు కూడా అన్ని పథకాలను సౌకర్యాలను అందిపుచ్చుకొని మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో మా జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి మండల టాపర్ గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. చాలా రోజుల సెలవుల  తర్వాత విద్యార్థులకు పాఠశాలకు రావడంతో విద్యార్థిని విద్యార్థులు చాలా ఆనందం వ్యక్తం చేశారు.

 

 

. ఎప్పుడెప్పుడు పాఠశాలలు తెరుస్తారా ఎప్పుడు ఎప్పుడు బడికి పోదామా అంటూ  ఇన్నాళ్లు ఎదురు చూసామని ఆరోజు ఈరోజు రానే వచ్చిందని విద్యార్థిని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ చెప్పారు. విద్యార్థిని విద్యార్థులు చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఆనందం వ్యక్తం చేసుకున్నారు. అలాగే టీచర్లను కూడా కలుసుకొని చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు సెలవులలో పిల్లలు దూరం అవడంతో ఈరోజు పాఠశాల పునః ప్రారంభం రోజున పిల్లలందరితో  కలసి పాఠశాలలో గడపడం చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు  విద్యార్థుల  జీవితాలలో పాఠశాలకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు విడదీయరాని సంబంధం ఉందని,  పాఠశాలలో వారి వారి జీవితాలలో ఎన్నో మధురానుభూతులు కలగలిసి ఉంటాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు .విద్యార్థులకు పాఠాలు చెప్పడం వారిని జీవితంలో ఉన్నత విద్యావంతులుగా జ్ఞనవంతులుగా తీర్చిదిద్దడం మాకు ఎంతో ఆనందాన్నిస్తుందని ప్రధానోపాధ్యాయులు అంపయ్య ఇతర ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంపయ్యతో పాటు సీనియర్ ఉపాధ్యాయులు బందే నవాజ్, శ్రీనివాసులు శెట్టి, తిమ్మప్ప ,నాగభూషణం, నాగరాజు, అస్లాం, ప్రభాకర్ రావు ,కేఎం. శ్రీనివాసులు ,బసవరాజు, బి. శ్రీనివాసులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

 

Tags: Distribution of Jagananna Vidya Kanuka Kits in Mantralayam ZP High School

Leave A Reply

Your email address will not be published.