రైతులకు మొక్కజొన్న విత్తనాలు పంపిణీ

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండలానికి పశుశాఖ తరఫున మొక్కజొన్న, కాకి జొన్న విత్తనాలు వచ్చినట్లు పశువైద్యాధికారి దివ్య తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పాడి రైతులు పశువుల మేత పెంచుకునేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. 4000 కేజీల మొక్కజొన్న, 5900 కేజీల కాకి జొన్నలు వచ్చినట్లు తెలిపారు. మొక్కజొన్న ఐదు కిలోల బ్యాగు రూ. 85లు, కాకి జొన్నలు ఐదు కిలోల బ్యాగు రూ.165 రూపాయలు చెల్లించాలన్నారు. కావలసిన రైతులు ఆధార్ కార్డు జిరాక్స్ అందజేసి విత్తనాలు తీసుకోవచ్చునన్నారు.

 

Tags: Distribution of maize seeds to farmers

Leave A Reply

Your email address will not be published.