Distribution of masks and sanitizers by merchants

వర్తక వ్యాపారులచే మాస్క్ లు , శానిటైజర్లు పంపిణీ

Date:09/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు వర్తక వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఏ.వెంకటాచలపతిశెట్టి, సంతూర్‌ ఏజెన్సీ నిర్వాహకులు వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో మాస్క్ లు, శానిటైజర్లు , ఫినాయిల్‌, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి , కౌన్సిలర్‌ అభ్యర్థి అర్షద్‌అలి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు నాగరాజారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు ద్వారా వైద్యసిబ్బందికి, సచివాలయ ఉద్యోగులకు, సిబ్బందికి పంపిణీ చేశారు. అలాగే వ్యాపారులు సీఐ గంగిరెడ్డి చేతులు మీదుగా పోలీసులకు కూడ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాపారులు సుమారు రూ.25 వేలు విలువ చేసే వస్తువులను విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. అలాగే పేద ప్రజలను ఆదుకునేందుకు వ్యాపారులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ రెడ్డెప్ప, మాజీ కోఆఫ్షన్‌ మెంబర్‌ ఖాదర్‌బాషా,వ్యాపారుల సంఘ నాయకులు రవిచంద్రశెట్టి , హరినాథజెట్టి, వెంకటేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చుక్కలు చూస్తున్న మొక్కజొన్న

Tags: Distribution of masks and sanitizers by merchants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *