Distribution of meals by traders and students in Punganur

పుంగనూరులో వ్యాపారులు, విద్యార్థులచే భోజనం పంపిణీ

Date:20/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 1983 సంవత్సరం పూర్వపు విద్యార్థులు పట్టణ వర్థక వ్యాపారుల సంఘంచే సోమవారం ఆరవ రోజు భోజనం పంపిణీ నిర్వహించారు. పట్టణ కౌన్సిలర్‌ అభ్యర్థి అర్షద్‌అలి 700 మందికి భోజనం ప్యాకెట్లను విరణగా ఇచ్చారు అనాదశ్రమం, జోగిండ్లు, మార్కస్ నగర్‌, దోబీకాలనీలోని పేదలకు భోజనం ప్యాకెట్లను ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్‌ అభ్యర్థి శ్రీనివాసులు, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, కౌన్సిలర్‌ అభ్యర్థి అర్షద్‌అలి, వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి , వెంకటేష్‌, న్యాయవాది పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, తరుణ్‌ జ్యూవెలర్స్ అధినేత పిఎస్‌.నాగరాజ, రవిచంద్రశెట్టితో కలసి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్షద్‌అలి మాట్లాడుతూ ప్రతి రోజు 700 మందికి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ పూర్తి అయ్యేంత వరకు భోజనం పంపిణీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుధాకర్‌, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం సీసాలు మాయం.

Tags: Distribution of meals by traders and students in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *