-మాస్క్ లు, శానిటేజర్లు విరాళం
– ముందుకొస్తున్న దాతలు
Date:27/03/2020
పుంగనూరు ముచ్చట్లు:
కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు, ఉద్యోగులకు భోజనం, శానిటేజర్లు, మాస్క్ లువిరాళంగా అందించారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం 500 మందికి భోజనం, వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేయగా వాటిని కమిషనర్ కెఎల్.వర్మ పంపిణీ చేశారు. అలాగే ముస్లిం యువనాయకుడు అస్లాం పేదలకు భోజనం పంపిణీ చేశారు. మానవత సంస్థ ఆధ్వర్యంలో మజ్జగ, బిస్కెట్లు, మంచినీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ముస్లిం మైనార్టీ నాయకుడు అర్షద్‌అలి , ఆయన సతీమణి డాక్టర్ కౌసర్ ఆధ్వర్యంలో 1000 మాస్క్‌లు, శానిటేజర్లు పంపిణీ చేశారు. అలాగే రోటరీక్లబ్ అధ్యక్షుడు డాక్టర్ జాన్ 250 మందికి మాస్క్ లు పంపిణీ చేశారు. అలాగే మాజీ కౌన్సిలర్లు ఇబ్రహిం, ఆసిఫ్, ఖాజా, అస్లాం ఆధ్వర్యంలో ప్రజలకు మాస్క్ లు, శానిటేజర్లు పంపిణీ చేశారు. రోడ్లపై తిరుగుతున్న వారికి స్వయంగా వారే మాస్క్‌లు కట్టారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అలాగే దివ్యజ్ఞాన మందిరం హెల్త్‌కేర్ సోసైటి వ్యవస్థాపకులు డాక్టర్ రమణ్‌రావు ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మాస్క్ లు, శానిటేజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫకృద్ధిన్‌షరీఫ్, అమ్ము, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Tags: Distribution of meals to police and workers