మెడికల్ క్యాంపులో మందుల పంపిణీ
మంథని ముచ్చట్లు:
మంథని మండలం సూరయ్య పల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గద్దలపల్లి ప్రాథమిక వైద్యశాల వైద్య బృందంచే సోమవారం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వర్షాకాలపు సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ శంకరా దేవి వైద్య బృందం చే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీముని పుష్ప, మజీ ఎంపీటీసీ భీముని వెంకటస్వామి, ఎంపీఓ శేషయ్య సూరి, ఉప సర్పంచ్ రాజిరెడ్డి, వార్డు సభ్యులు రౌతు నరేష్, కార్యదర్శి మౌనిక,ఇతర వార్డు సభ్యులు, ఆశా వర్కర్ ఆర్ల స్వరూప రాణీ లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.
Tags: Distribution of medicines in medical camp