Distribution of money to ration card holders is a success

రేషన్‌కార్డు దారులకు డబ్బు పంపిణీ విజయవంతం

– వైఎస్‌ఆర్‌సీపీ నేతల సేవలు బేష్‌

Date:04/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన మేరకు రేషన్‌కార్డుదారులకు ఒకొక్కరికి రూ.1000లు పంపిణీ కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెలో ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు , అలాగే జెడ్పిటీసీ నల్లబాల జ్ఞానప్రసన్న , ఆమె భర్త చంద్రారెడ్డి యాదవ్‌లు కలసి డబ్బులు పంపిణీ చేశారు. తమ్మరాజుపల్లెలో వలంటీర్‌ మర్రిబాబు ఆధ్వర్యంలో డబ్బులు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలో కౌన్సిలర్‌ అభ్యర్థి అమ్ము ఆధ్వర్యంలో వేకువజాము నుంచి వలంటీర్లు , సచివాలయ ఉద్యోగులు డబ్బులు పంపిణీ చేశారు. అలాగే కౌన్సిలర్‌ అభ్యర్థులు రేష్మా, అలీమ్‌బాషా, డి.సాజిదా, నరసింహులు, శ్రీనివాసులు , పెద్దిశెట్టి జయభారతి, మహబూబ్‌బాషా, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, పార్టీ నేతలు ఆసిఫ్‌ ,అయాజ్‌, రషీద, అస్లాం మురాధి, పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నక్కబండలో ఖాదర్‌బాషా పంపిణీ చేశారు.

    

 

క్వారంటైన్‌ సెంటర్‌ పరిశీలించిన అర్షద్‌అలి

Tags: Distribution of money to ration card holders is a success

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *