పర్యావరణ రక్షణ కొరకై 570కి పైగా మట్టి వినాయక విగ్రహలు పంపిణీ
ఏర్పేడు ముచ్చట్లు:
యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులైన ఫౌండర్ డాక్టర్ గానుగపెంట రమేష్ , సంస్థ రాష్ట్ర అధ్యక్షులు తాలిక్కాల్ వెంకటేశ్వర్లు వారి ఆధ్వర్యంలో పర్యావరణ రక్షణ కొరకై 570కు పైగా మట్టి వినాయక విగ్రహాలను ఆ సంస్థ సభ్యులచే ఏర్పేడు మండలం, ఏర్పేడు, నాగంపల్లి, అముడూరు ,రాజుల పాలెం ,అంజిమేడు, గోపాలపురం ,పాతవీరాపురం మేర్లపాక మరియు శ్రీకాళహస్తి మండలం, అరవ కొత్తూరు, తొండమనాడు రేణిగుంట మండలం కరకంబాడి ,దొడ్ల మిట్ట పలు గ్రామాలలో ఉన్న ప్రజలకు అందరికీ పర్యావరణ రక్షణ కొరకు రసాయనాలతో కలుషితమైన బొమ్మలను కాకుండా మట్టి వినాయక విగ్రహాల ప్రతిమలు మాత్రమే పూజిద్దాం అని అవగాహన కల్పిస్తూ మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను గ్రామంలోని ఇంటింటికి సంస్థ సభ్యులు ప్రతినిధులు పంపిణీ చేశారు .అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సంస్థ సభ్యులు రాజేంద్ర ,పవన్, శివ, రాజేష్, లోకేష్ ,సురేంద్ర, గిరి, చిరంజీవి, పి శివ, మోహిత్ ,తిరుమల, ధన ఇతర సభ్యులు గ్రామ ప్రజలు పిల్లలు పాల్గొన్నారు.

Tags: Distribution of more than 570 clay Ganesha idols for environmental protection
