పుంగనూరులో నూతన పెన్షన్లు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని 31వ వార్డులలోని అర్హులైన 147 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లు పంపిణీ చేశారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేశారు. రహమత్‌నగర్‌లో సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్దిన్‌షరీఫ్, కౌన్సిలర్ సాజిదాబేగం పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్, నరసింహులు, పూలత్యాగరాజు, జెపి.యాదవ్, కాళిదాసు, పద్మావతి, భారతి, మనోహర్ ఆయావార్డులలో నూతన పెన్షన్లు, పాత పెన్షన్లు పంపిణీ చేశారు.

మండలంలో…
మండలంలోని 23 పంచాయతీలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో నారాయణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. పంచాయతీలలో సర్పంచ్‌లు, వలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
Tags: Distribution of new pensions in Punganur
