కిశోర బాలికలకు పోషకాహార కిట్ల పంపిణీ

-పోషకాహారంపై ప్రత్యేక దృష్టి…
-ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డినర్సంపేట ముచ్చట్లు:


ఎదిగే దశలో చిన్నారులకు పౌష్టికాహారం అందిం చడం అత్యంత కీలకమైనదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.  బుధవారం నియోజకవర్గంలోని ఐసిడిఎస్ పరిధిలో గల దివ్యాంగ కిషోర బాలికలకు (11 నుండి 14 సంవత్సరాల లోపు) క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పోషకాహార కిట్లను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచేలా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. ఆరోగ్యవంతంగా ఉండడం కోసం న్యూట్రిషన్ కిట్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.  డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు కలిపి మొదటి విడతగా 20 మంది లబ్ధిదారులకు, రెండో విడతలో మరింత ఎక్కువ మందికి అందజేయనున్నట్లు తెలిపారు. విడతలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్టు ద్వారా పోషకాహార కిట్లు అందజేస్తామని ఎమ్మెల్యే ‘పెద్ది’ స్పష్టం చేశారు. నర్సంపేట సిడిపిఓ రాధిక మాట్లాడుతూ కిట్లలో పది కిలోల గోధుమలు, 500 గ్రాముల నెయ్యి, ఒక కిలో ఖర్జూర పండ్లు, 750 గ్రాముల ప్రోటీన్ బిస్కెట్లు, నాలుగు ఐరన్, జింక్ సిరప్ లు , 90 క్యాల్షియం మల్టీ విటమిన్ టాబ్లెట్ లు ఉన్నాయన్నారు. రెండో విడత కిట్లు ప్రతీ మండల కేంద్రాలలో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ రాధిక, నల్లబెల్లి ఎంపిపి ఊడుగుల సునీత, సూపర్వైజర్లు  పి.ఝాన్సీ, వి.శ్యామల, కె.మంజుల, కె.ఝాన్సీ రాణి, కె.రాధ, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, అంగన్వాడీ టీచర్లు దేవమ్మ, స్వరూప, సరిత, విజయ, సునీత లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

Tags: Distribution of nutritional kits to adolescent girls

Leave A Reply

Your email address will not be published.